![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ మీద ఇప్పటికే చాలా కామెంట్స్ వస్తున్నాయి. కోర్ట్ నోటీసులు కూడా వస్తున్నాయి. ఐతే ఆడియన్స్ లో మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఈ సీజన్ ఎలా ఉండబోతోంది. ఇందులో కొత్త రూల్స్ ఏమిటి ...ఎవరెవరు రాబోతున్నారు...అసలు ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది...కుడి ఎడమైతే అనే దానికి అసలు కరెక్ట్ మీనింగ్ ఏమిటి ? లాంటివి ఎన్నో ఉన్నాయి. ఐతే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు మాత్రం ఇన్స్టాగ్రామ్ లో బిగ్ బాస్ ఆఫీషియల్ పేజీ నుంచి కొన్ని ఆన్సర్స్ వచ్చాయి.

"బీబీ 7 గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న క్లారిఫై చేసుకోండి.." అనే అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి నెటిజన్స్ ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారు. "బీబీ 7 రూల్స్ ఏమిటి" "న్యూ రూల్స్ అంటూ ఏవీ ఉండవు...ఈ సీజన్ లో టోటల్ పవర్స్ నాగ్ సర్ చేతుల్లో ఉంటాయి. డైరెక్టర్స్ చెప్పేది నాగ్ సర్ వినాల్సిన అవసరం లేదు". "ఈ సీజన్ లో ఎంతమంది కంటెస్టెంట్స్ రాబోతున్నారు" అని అడగగా "సీజన్ స్టార్ట్ అయ్యే వారం ముందు వరకు కూడా వీళ్ళు ఎవరు కంఫర్మ్ అయ్యారో..ఎవరు హౌస్ లోకి వెళ్ళబోతున్నారో చెప్పలేము...ఆ కంటెస్టెంట్స్ కి కూడా క్లారిటీ ఉండదు అసలు వెళ్తున్నారో..లేదో కూడా వాళ్ళకే తెలీదు..కాబట్టి ఎంతమంది కంటెస్టెంట్స్ అనే విషయం మాత్రం చెప్పలేము" అని ఆన్సర్ ఇచ్చారు. "వర్షిణి ఉందా లేదా" "రావడం లేదు", " బీబీ 7 విన్నర్ అబ్బాయా అమ్మాయా" " ఏమో సర్ నాకు తెలీదు", "బీబీ 7 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది" " సెప్టెంబర్ 3 ..పక్కా ", "బీబీ 7 టీవీలో టెలికాస్ట్ అవుతుందా..ఎందుకంటే కోర్ట్ లో పిటిషన్స్ ఉన్నాయి కదా" " సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు, మంచి రేటింగ్ వస్తున్నప్పుడు ఈ పిటిషన్స్ వేస్తూనే ఉంటారు. బిగ్ బాస్ కి ఇవో లెక్క కాదు...కోర్ట్ పిటిషన్స్ ఏమీ చేయలేవు", "నెక్స్ట్ ప్రోమో ఎప్పుడు వస్తుంది" " ఆదివారం నుంచి మంగళవారం మధ్యలో రిలీజ్ అవుతుంది" అంటూ బీబీ హౌస్ సెట్ కూడా రెడీ ఐపోయిందంటూ అఫిషియల్ పేజీ నుంచి ఆన్సర్స్ వచ్చాయి.

![]() |
![]() |